Revanth Reddy: అవును.. ఈటల రాజేందర్‌ను కలిశాను

Revanth Reddy: మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 23 Oct 2021 8:30 PM IST
Revanth Reddy Counter to KTR over Revanth Reddy and Etela Rajender Meeting
X

Revanth Reddy: అవును.. ఈటల రాజేందర్‌ను కలిశాను

Revanth Reddy: మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ ను తాను బహిరంగంగానే కలిశానని స్పష్టం చేశారు. వేం నరేందర్‌రెడ్డి కొడుకు పెళ్లి పత్రిక సందర్భంగా నేతలందరం కలిశామన్నారు. మే 7న ఈ కార్యక్రమం గోల్కొండ రిసార్టులో జరిగిందన్నారు. ఈటలను తాను చీకట్లో కలువలేదన్నారు. కేసీఆర్ కుట్రలను తనతో ఈటల చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం ఎవరు ఏర్పాటు చేశారని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story