Revanth Reddy: కవిత, అర్వింద్‌లను నమ్మి గెలిపిస్తే.. రైతులను మోసం చేశారు

Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మోసం చేశారు

Jyothi
Published on: 23 April 2024 10:12 AM IST
Revanth Reddy Comments On MLC Kavitha, Arvind
X

Revanth Reddy: కవిత, అర్వింద్‌లను నమ్మి గెలిపిస్తే.. రైతులను మోసం చేశారు

Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. జన జాతర సభలు, రోడ్‌షోలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే.. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4నెలల పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన హామీలను ప్రస్తావిస్తూనే...విపక్షాలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ- కేసీఆర్ తోడు దొంగలని సీఎం రేవంత్‌ సంచలన ఆరోపణలు చేశారు.

తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజి నిర్మించి ఆదిలాబాద్‌లో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌‌లో కవిత, అర్వింద్‌లను నమ్మి గెలిపిస్తే రైతులను మోసం చేశారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బాసరా అమ్మవారిపై సాక్షిగా ఆగస్టులోగా రైతుల 2లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మత మధ్య చిచ్చు పెట్టి..రాజకీయం చేస్తున్నారు ధ్వజమెత్తారు రేవంత్.

Jyothi

Jyothi

Next Story