Revanth Reddy: కేటీఆర్ శాఖ పరిధిలోనే పేపర్ లీక్ అయింది

Revanth Reddy: పేపర్ లీక్‌పై మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలి

Dhatripriya
Published on: 22 March 2023 2:42 PM IST
Revanth Reddy Comments On KTR About TSPSC Paper Leak
X

Revanth Reddy: కేటీఆర్ శాఖ పరిధిలోనే పేపర్ లీక్ అయింది

Revanth Reddy: పేపర్ లీక్‌ వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసైని కలిశారు టీకాంగ్రెస్ నేతలు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్న రేవంత్‌ రెడ్డి.. గవర్నర్ ముందు రెండు డిమాండ్లు ఉంచామన్నారు. కేటీఆర్‌ను విచారణ చేసేలా అనుమతి ఇవ్వాలని.. టీఎస్‌పీఎస్సీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరినట్లు తెలిపారు రేవంత్‌ రెడ్డి. ఐటీ శాఖ పరిధిలోనే పేపర్ లీక్ అయింది కాబట్టి అందుకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులను సస్పెండ్ చేసి విచారణ చేస్తారని ఆశించినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని..పైగా వారిని మంత్రి కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story