మోడీ, కేసీఆర్, జగన్‌, అసదుద్దీన్‌ ఓవైసీ నలుగురూ ఒక్కటే - రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: పర్మిషన్‌ ఇవ్వకున్నా ఉస్మానియాకు వెళ్లి తీరుతాం - రేవంత్‌ రెడ్డి

Shireesha
Updated on: 30 April 2022 9:57 AM IST
Revanth Reddy Comments on KCR KTR Harish Rao YS Jagan Narendra Modi | Live News
X

మోడీ, కేసీఆర్, జగన్‌, అసదుద్దీన్‌ ఓవైసీ నలుగురూ ఒక్కటే - రేవంత్‌రెడ్డి

Revanth Reddy: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక వేళ పర్మిషన్ ఇవ్వకున్నా ఉస్మానియాకు వెళ్లి తీరుతామన్నారు. టీఆర్ఎస్ పార్టీ నీడను కాంగ్రెస్ భరించదన్నారు. హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరువరాదన్నారు. హరీష్ రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ ను, కేటీఆర్ టీడీపీని తిట్టే అర్హత లేదన్నారు.

వైసీపీ పాలనను కేటీఆర్ విర్శించడం చూస్తుంటే టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రశాంత్ కిషోర్ ను పార్టీ లో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అహ్వానించిందని.. ఇతర పార్టీలకు సలహాదారుగా ఉంటే కుదరదని అల్టిమేటం జారిచేసిందన్నారు.. అందుకే పీకే కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరించారన్నారు. కేసీఆర్ రాజకీయ జీవింతలో ప్రస్తుత పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.

Shireesha

Shireesha

Next Story