Revanth Reddy: మునుగోడు ప్రజలను కేసీఆర్ నిరాశపరిచారు

Revanth Reddy: ప్రజా దీవెన సభను రాజకీయ విమర్శలకే పరిమితం చేశారని రేవంత్‌ ఆగ్రహం

Jyothi
Published on: 22 Aug 2022 7:22 AM IST
Revanth Reddy Comments On CM KCR
X

Revanth Reddy: మునుగోడు ప్రజలను కేసీఆర్ నిరాశపరిచారు 

Revanth Reddy: మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పకుండా.. కేసీఆర్ ప్రజలను మరోసారి వంచించారని ఎద్దేవా చేశారు. ఏం వరాలు ప్రకటిస్తారా? అని ఎదురుచూసిన మునుగోడు ప్రజలను కేసీఆర్ నిరాశపరిచారని రేవంత్ విమర్శించారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయకపోవటంతో మునుగోడులో సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయన్నారు. ఈడీ విషయంలో సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఆదర్శంగా తీసుకుందని.. రేవంత్ రెడ్డి మండిపడ్డారు

Jyothi

Jyothi

Next Story