Top
logo

ఆర్టీసీ సమ్మె కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలం : రేవంత్ రెడ్డి

ఆర్టీసీ సమ్మె కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలం : రేవంత్ రెడ్డి
X
Highlights

-తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు -ఆర్టీసీ సమ్మె కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలం -కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు -19న నిర్వహించే తెలంగాణ బంద్ కు సహకరించాలి

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. రెండు రోజులు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగానికి రాలేదని తీసేస్తే ఆరేళ్లుగా సచివాలయానికి రాని సీఎంపై పీడీ యాక్ట్‌ పెట్టాలా వ్యంగంగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారన్నారు.

గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. సమ్మెను అణిచివేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఈనెల 19న నిర్వహించే బంద్ కు అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, పోలీసు సంఘాలు సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ అఖిపక్షం మద్దతు కోరింది. శనివారం శ్రీనివాస్ రెడ్డి అనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమ్మె తీవ్ర రూపం దాల్చింది. దీనికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. ఈనెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.

Next Story