Revanth Reddy: ఓఆర్ఆర్ టెండర్ దోపిడీ.. హెచ్ఎండీఏను ముట్టడిస్తాం..!

Revanth Reddy: ఓఆర్ఆర్ టెండర్ దోపిడీ.. హెచ్ఎండీఏ ను ముట్టడిస్తాం..!

Dhatripriya
Published on: 24 May 2023 1:24 PM IST
Revanth Reddy About ORR Tender Issue
X

Revanth Reddy: ఓఆర్ఆర్ టెండర్ దోపిడీ.. హెచ్ఎండీఏను ముట్టడిస్తాం..!

Revanth Reddy: సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్‌ పర్యవేక్షణలో తెగనరికారన్నారు. ఓఆర్‌ఆర్‌ను తక్కువ ధరకు ముంబై కంపెనీకి కట్టబెట్టారు రేవంత్ విమర్శించారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇచ్చిన 30 రోజుల్లో డబ్బులు చెల్లించాలి ..కానీ ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారన్నారు.ఒప్పందాన్ని ఉల్లంఘించి కేటీఆర్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. ఈనెల 26లోగా ఐఆర్‌బీ సంస్థ 10 శాతం నిధులు చెల్లించాలి..లేదంటే సంస్థ టెండర్లను రద్దు చేయాలని ఆందోళన చేస్తామన్నారు రేవంత్‌రెడ్డి. బండి సంజయ్‌ ఓఆర్‌ఆర్‌పై ఎందుకు మాట్లా్ట్లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Dhatripriya

Dhatripriya

Next Story