Revanth Reddy: కర్ణాటక ఎన్నికలు అక్కడి కంటే టీ కాంగ్రెస్‌కే కీలకం

Revanth Reddy: ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు ప్రచారానికి హాజరుకావాలని ఆదేశం

Dhatripriya
Published on: 2 April 2023 6:31 PM IST
Revanth Reddy About Karnataka Assembly Elections
X

Revanth Reddy: కర్ణాటక ఎన్నికలు అక్కడి కంటే టీ కాంగ్రెస్‌కే కీలకం

Congress: కర్ణాటక ఎన్నికల ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. కర్ణాటకలో జరిగే ఎన్నికలు అక్కడి వారి కంటే టీ కాంగ్రెస్‌కే 2 వందల శాతం కీలకమని తెలిపారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంపై చర్చ జరగగా.. ప్రచారానికి వెళ్లే నేతల జాబితా ఇవ్వాలని కోరారు రేవంత్. ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లే అని కామెంట్ చేశారు రేవంత్.

మరోవైపు ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. రాహుల్‌పై అనర్హత వేటుతో పాటు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసు అంశాలపై నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఏప్రిల్ 8న రాహుల్‌పై అనర్హత వేటుకు వ్యతిరేకంగా మంచిర్యాలలో నిరనస కార్యక్రమం చేపట్టనుంది. ఏప్రిల్ 10 నుంచి రేవంత్‌ రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పున:ప్రారంభించనున్నారు. పేపర్‌ లీక్‌తో నష్టపోయిన నిరుద్యోగులకు అండగా నిరసన కార్యక్రమం చేపట్టనుంది టీ కాంగ్రెస్. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనుంది కాంగ్రెస్. పేపర్ లీక్ కేసులో NSUI నిరసన కార్యక్రమాలు చేయనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story