తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

సెక్రటేరియట్‌ లోపల మరిన్ని మార్పులు, చేర్పులు చేయిస్తున్న ప్రభుత్వం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Jun 2024 3:45 PM IST
Congress Government Decission On Make Vaastu Changes To Telagnana Secretariat
X

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో కొన్ని వాస్తు మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ లోపలకు వచ్చేది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలకు వచ్చి.. నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్‌ వెళ్లేలా మార్పులు చేస్తున్నారు. అటు సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. గతంలో సీఎం ఆఫీస్‌ను 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో ఆ పనులు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్‌ లోపల కూడా మరిన్ని మార్పులు, చేర్పులు చేయిస్తోంది ప్రభుత్వం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story