కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని.. కొడాలి వ్యాఖ్యలకు రేణుకా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్..

Renuka Chaudhary Gives Counter to Kodali Nani
x

కొడాలి నాని లారీలు కడుక్కునే టైంలోనే కార్పొరేటర్‌ని.. కొడాలి వ్యాఖ్యలకు రేణుకా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్..

Highlights

Renuka Choudhary: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి.

Renuka Choudhary: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే గుడివాడలో పోటీ చేసి నాని సంగతి తేలుస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొడాలి నాని రేణుకాచౌదరి పేరు ప్రస్తావనకు తేవడంతో ఆమె ఘాటుగా స్పందించారు. కొడాలి నాని అనే వ్యక్తిని గుడివాడ ప్రజలు మరోసారి ఓట్లేసి గెలిపించరంటూ హాట్ కామెంట్స్ చేశారు.

అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. కొడాలి కామెంట్ పై రేణుక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు.

కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్‌ని అంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.. నీకు చరిత్ర తెలియదు అంటూ కొడాలికి సూచించారు. గూగుల్ కొట్టు.. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుందన్నారు. ఖమ్మం గల్లీల్లోకి వచ్చి తిరిగి చూడు నేనేంటో తెలుస్తుందని కొడాలి నానికి ధీటుగా బదులిచ్చారు రేణుకాచౌదరి. మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని కేవలం పదవి కోసం తన పేరును అసెంబ్లీలో తెచ్చి తనకు బాగా పబ్లిసిటీ తెచ్చి పెట్టారంటూ పాజిటివ్‌గా స్పందించారు. తాను రాజధాని రైతుల పాదయాత్రకు మద్దతిచ్చాను తప్ప టీడీపీకి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా రేణుకా చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో ఆసక్తికరంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories