రేంజర్ల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

రేంజర్ల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

Arun Chilukuri
Updated on: 31 Dec 2022 4:28 PM IST
Renjarla Rajesh Was Detained by the Hyderabad Police
X

రేంజర్ల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

Renjarla Rajesh: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న రేంజర్ల రాజేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టాలని నిజామాబాద్‌ పోలీసులను ఆదేశించారు. భైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో రేంజర్ల రాజేశ్ వేదికపైనే ఉన్నారు. రాజేశ్‌పై ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ ముందస్తుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్ ముందు భైరి నరేష్‌ను పోలీసులు హాజరుపర్చారు. భైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఫస్ట్ క్లాస్‌ మేజిస్ట్రేట్. భారీ బందోబస్తు మధ్య భైరి నరేష్‌ను పరిగి జైలుకు తరలించారు కొడంగల్ పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story