Nizamabad: క్షమాపణలు చెప్పిన రేంజర్ల రాజేష్..

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రేంజర్ల‎ రాజేష్ ఇంటి ముందు అయ్యప్ప స్వాములు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 31 Dec 2022 11:10 AM IST
Renjarla Rajesh Apologies Ayyappa Devotees
X

Nizamabad: క్షమాపణలు చెప్పిన రేంజర్ల రాజేష్..

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రేంజర్ల‎ రాజేష్ ఇంటి ముందు అయ్యప్ప స్వాములు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ రాజేశ్‌ అయ్యప్పను కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టాడని ఆరోపించారు. అయితే అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ చివరకు క్షమాపణ చెప్పాడు.

దీంతో రాజేష్ ఇంటి ముందు అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన విరమించారు. పోలీసుల జోక్యంతో చివరకు వివాదం సద్దుమణిగింది. అంతకుముందు రేంజర్ల రాజేష్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు అయ్యప్పభక్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story