మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసు రిమాండ్ రిపోర్ట్..కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు

మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసు రిమాండ్ రిపోర్ట్..కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు
x
Highlights

మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయాడు. ఒకటి కాదు రెండు...

మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లక్షలు రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ వెల్లడైంది. 112.21ఎకరాల ఎన్వోసి కేసులో అడిషనల్ కలెక్టర్ మొత్తం కోటి 12లక్షు డిమాండ్ చేసారు. భూమి యజమానులు NOC కోసం పలుమార్లు పిటీషన్ ను దాఖలు చేసారు.

అనంతరం ఈ విషయంపై మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ను సంప్రదించగా నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. దాని కోసం ఏకంగా రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తరువాత కాసేపు మాట్లాడుకుని ఎకరాకు లక్ష చొప్పున ఇవ్వాలంటూ రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. 1.12లక్షల్లో కలెక్టర్ కు ఇవ్వాలని దర్మారెడ్డి పేరు ప్రస్తావించారు. అయితే పూర్తి మొత్తం నగదు కాకుండా తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని, రూ.40 లక్షల నగదు ఇవ్వాలని కోరారు.

కాగా బాధితులు రెవిన్యూ అధికారులతో జరిగిన సంప్రదింపులను ఫోన్ లో మొత్తం రికార్డ్ చేసి ఏసీబీ అధికారుల ఫిర్యాదు చేసారు. కాగా నగేష్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీబీ అధికారుల విచారణలో నగేష్ పలుమార్లు కలెక్టర్ దర్మారెడ్డి పేరు ప్రస్తావించారు. కాగా నిందితులుగా A1 అడిషనల్ కలెక్టర్ నగేష్, A2 వసీం అహ్మద్, A3 ఆర్డీవో అరుణా రెడ్డి, A4 ఎమ్మార్వో సత్తార్, A5 భినామి జీవన్ గౌడ్ లను నిర్ధారించారు. వారిపై u/s 7(a)b sec 12& 13(1)a(b) of pc act1988 sec120-B r/w కేసులు నమోదు చేసారు. అంతే కాదు ఏసీబీ అధికారులు మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ చేసిన సోదాల్లో నగేష్ నివాసంలో ఎనిమిది చెక్స్, 5ఎకరాల అగ్రిమెంట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఇక పోతే అడిషన్ కలెక్టర్ నగేష్ డిమాండ్ చేసిన మొత్తంలో బాధితుల నుంచి 40లక్షలను అడ్వాన్స్ గా రెండు విడతల్లో తీసుకున్నాడు. మిగిలిన 72లక్షలకు ఐదు ఎకరాలు భినామి A5, పేరుమీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయాలని కోరారు. ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే NOC కోసం రిపోర్ట్ పంపించాడు. ఇక ప్రస్తుతం కింది స్థాయి ఉద్యోగుల పాత్రపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories