Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం

* మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల * కాళేశ్వరం కాల్వ నుంచి జలాశయంలోకి నీటిని మళ్లింపు

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 10:15 AM IST
Release of Water Into Mallanna sagar Reservoir From Kaleshwaram Project
X

మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటి విడుదల (ట్విట్టర్ ఫోటో)

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్‌ అయిన మల్లన్న సాగర్‌ జలాశయంలోకి నీటిని విడుదల చేశారు. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాల్వ నుంచి జలాశయంలోకి అధికారులు నీటిని మళ్లించారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్‌ వద్ద పంప్‌హౌస్‌లో 8 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు రిజర్వాయర్ల ద్వారా మలన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ఏడాది మల్లన్న సాగర్‌లో పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story