Nizamabad: కులం పిచ్చి.. ఓ బంధాన్ని విడదీసింది..

Crime News: కులం పిచ్చి..ఓ బంధాన్ని విడదీసింది.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 7:15 PM IST
Relatives Kidnapped Woman From her Husband House in Nizamabad
X

Nizamabad: కులం పిచ్చి.. ఓ బంధాన్ని విడదీసింది..

Crime News: కులం పిచ్చి..ఓ బంధాన్ని విడదీసింది. నిజామాబాద్ జిల్లాలో 6నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంటను విడదీశారు సదరు వివాహిత తరఫు బంధువులు. భర్త నుంచి బలవంతంగా విడదీసి పుట్టింటికి పంపించిన ఘటన కలకలం రేపింది. ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన వంశీకృష్ణ 6నెలల క్రితం ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. యువతి భర్త వంశీకృష్ణ లేని సమయంలో యువతి తరఫు కుటుంబీకులు, బంధువులు..అతడి కుటుంబీకులపై దాడి చేశారు. అంతేకాకుండా వంశీకృష్ణ భార్యను బైకుపై తీసుకెళ్లారు. ఎర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వంశీకృష్ణ ఆరోపించారు. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story