Rekha Nayak: కన్నీటి పర్యంతమైన రేఖానాయక్.. కాంగ్రెస్‌ టికెట్‌కు ఎమ్మెల్యే దరఖాస్తు

Rekha Nayak: కేవలం మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు కావడం వల్లే టికెట్‌ ఇచ్చారు

Shekhar G
Published on: 22 Aug 2023 3:00 PM IST
Rekha Nayak Applied Congress MLA Ticket
X

Rekha Nayak: కన్నీటి పర్యంతమైన రేఖానాయక్.. కాంగ్రెస్‌ టికెట్‌కు ఎమ్మెల్యే దరఖాస్తు

Rekha Nayak: సీఎం కేసీఆర్‌ తనకు అన్యాయం చేశారని ఆరోపించారు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాన్సన్‌ నాయక్‌ ఎస్టీయే కాదని, కేవలం మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు కావడం వల్లే టికెట్‌ ఇచ్చారని అన్నారు. స్థానికంగా ఉండే తనను కాదని పక్క జిల్లా వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనకు టికెట్‌ రాకపోవడం కక్షసాధింపు చర్యేనని ఫైర్‌ అవుతున్నారు రేఖానాయక్‌.

బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రేఖానాయక్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేఖానాయక్ పీఏ గాంధీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు. తనకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడం పట్ల రేఖానాయక్ కన్నీటి పర్యంతమైయ్యారు. నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని... ఇంకా తన పదవి కాలం 50 రోజలు ఉందని... ఈ 50 రోజులు ప్రజలతోనే ఉంటానని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story