Telangana: మీరుండగా నాకెలా మంత్రి పదవి వస్తుంది- రెడ్యా నాయక్

Telangana: వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన డీసీసీబీ సహకార సంఘం సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Arun Chilukuri
Published on: 10 April 2021 8:53 PM IST
Redya Naik Controversial Comments on Minister Errabelli Dayakar Rao
X

Telangana: మీరుండగా నాకెలా మంత్రి పదవి వస్తుంది- రెడ్యా నాయక్ 

Telangana: వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన డీసీసీబీ సహకార సంఘం సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పక్కనే మంత్రి ఎర్రబెల్లి ఉండగానే.. తన డోర్నకల్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని రెడ్యా నాయక్ మొహమాటం లేకుండా అనేశారు. నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఎర్రబెల్లి కల్పించుకుని మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? అంటూ.. రెడ్యా నాయక్‌ను ప్రశ్నించారు. దానిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డే తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. దీంతో 'నీకు కూడా త్వరలోనే మంత్రి పదవి వస్తుంది' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. 'మీరుండగా నాకెలా వస్తుంది' అని రెడ్యా నాయక్ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story