Mirchi Price: కొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. క్వింటాల్ మిర్చి ధర 90 వేలు..

Mirchi Price: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రేటు రికార్డ్ బ్రేక్ చేసింది.

Arun Chilukuri
Updated on: 29 Sept 2022 4:31 PM IST
Red Chilli Price Hits All Time Record In Warangal Enumamula Market Yard
X

Mirchi Price: కొత్త రికార్డు సృష్టించిన మిర్చి ధర.. క్వింటాల్ మిర్చి ధర 90 వేలు..

Mirchi Price: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రేటు రికార్డ్ బ్రేక్ చేసింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది లక్ష్మీ సాయి ట్రేడర్స్‌.

ఆశోక్‌ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే రూ. 90 వేలు పలికింది. మిగతా బస్తాలకు మాత్రం సాధారణ ధరలే చెల్లించారు. క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు పలకడంపై రైతు ఆశోక్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. జులైలో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ రకం మిర్చికి.. క్వింటాల్‌కు రూ. 32,500 ధర పలికిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో అత్యధికంగా రూ.35,500 పలికింది. తాజాగా ఈ రికార్డు బద్దలైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story