Red Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

Red Alert: రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన వాతావరణశాఖ

Sandeep Eggoju
Updated on: 7 Sept 2021 3:01 PM IST
Red Alert to 8 Districts in Telangana due to Low Pressure
X

భారీ వర్షాల కారణంగా తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Red Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలో 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలో వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్‌ రివ్యూ నిర్వహించారు. వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story