నల్లగొండ జిల్లాలో పోటాపోటీగా రికార్డింగ్ డాన్సులు

Nalgonda: నల్లగొండ జిల్లాలో పోటాపోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 31 March 2023 6:30 PM IST
Recording Dances in Nalgonda
X

నల్లగొండ జిల్లాలో పోటాపోటీగా రికార్డింగ్ డాన్సులు

Nalgonda: నల్లగొండ జిల్లాలో పోటాపోటీగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. తిరుమలగిరిలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వేర్వేరుగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. రికార్డింగ్ డాన్సులు పేరిట అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి డాన్సర్లను తీసుకువచ్చి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరై ఎంజాయ్ చేశారు.

తొలుత సినిమా పాటలకు డాన్సులంటూ కటింగ్ ఇచ్చినట్లే ఇచ్చే.. అర్ధరాత్రి దాటిన తర్వాత అసలు సీన్ కు తెరలేపారు. క్రమంగా అశ్లీలత శృతిమించి డాన్సులు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. వృధ్దులు, కుర్రాళ్లు అంతా కలిసి వారితో చిందులు వేశారు. పార్టీల నేతలు పోటా పోటీగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story