Turmeric: రికార్డు ధర పలికిన పసుపు.. క్వింటా రూ.15 వేలకు పైనే..

Turmeric: ఎంపీ అరవింద్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

Shekhar G
Published on: 5 March 2024 6:37 PM IST
Record Price For Turmeric In Nizamabad Market Yard
X

Turmeric: రికార్డు ధర పలికిన పసుపు.. క్వింటా రూ.15 వేలకు పైనే..

Turmeric: పసుపు పంటకు ఇటీవల అత్యధిక ధరలు పలుకుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ మార్కెట్ యార్డులో గరిష్ఠంగా ధర నమోదైంది. ఇబ్రహీంపట్నంకు చెందిన రైతు గంధం మోహన్‌ పసుపు ఆల్‌టైమ్‌ రికార్డు ధర 17వేల 11రూపాయలు పలికింది. రోజు రోజుకు పసుపు ధర పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్ బ్రేక్ చేస్తున్న పసుపు ధరలు పెరిగేందుకు కృషి చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పదేళ్లుగా అత్యల్ప ధరలతో కుదేలైన రైతులకు ఈ ధరలు జీవం పోస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story