హైదరాబాద్‌ జెఆర్‌సీలో కృష్ణంరాజు సంస్మరణ సభ.. హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Rebel Star Late Krishnam Raju Condolence Meeting in Hyderabad
x

హైదరాబాద్‌ జెఆర్‌సీలో కృష్ణంరాజు సంస్మరణ సభ.. హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Highlights

హైదరాబాద్‌ జెఆర్‌సీలో కృష్ణంరాజు సంస్మరణ సభ.. హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Hyderabad: సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సంస్మరణ సభను హైదరాబాద్ JRC కన్వెన్షన్‌లో నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి తలసాని తదితరులు పాల్గొన్నారు. కృష్ణంరాజుని అన్నగారు అనే సంభోదించేవాడినని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కృష్ణంరాజు మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు. సినిమా స్టార్. రెబల్ స్టార్ కానీ గ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి అని పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణంరాజు మృత్యువార్త తెలిసి రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే నాకు కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్ళడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్ళలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు. అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ ఫిలింనగర్ సొసైటీలో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృషంరాజు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణంరాజు. నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు. అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories