Top
logo

విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్.. ఆయన స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఆయనకు...

విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్.. ఆయన స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఆయనకు...
X
సజ్జనార్
Highlights

సాధారణంగా పోలీసులకు ప్రజలు జైకొట్టే సందర్భాలు అత్యంత అరుదనే చెప్పవచ్చు. పోలీసులు అనగానే నెగెటివ్ ఫీలింగే...

సాధారణంగా పోలీసులకు ప్రజలు జైకొట్టే సందర్భాలు అత్యంత అరుదనే చెప్పవచ్చు. పోలీసులు అనగానే నెగెటివ్ ఫీలింగే ఎక్కువగా కలుగుతుంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఓ పోలీస్ ఉన్నతాధికారి కోట్లాది మంది జేజేలు అందుకోవడం అసాధారణం. ఆయన ఈ విధమైన ప్రశంసలు అందుకోవడం మొదటిసారేం కాదు. ఇది రెండోసారి. ఆయనే విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. ఆయన స్పెషాలిటీ ఏంటో ఎందుకు ఆయనకు ఈ ఘనత దక్కిందో చూద్దాం.

తెలంగాణ ఉద్యమం తరువాత మరోసారి యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూపు సారించింది. దిశ కేసులో నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు కోట్లాది మంది జైకొడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనను ప్రశంసిస్తూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఎంతో మంది తమ ప్రొఫైల్ పిక్ గా ఆయన పిక్ పెట్టుకుంటున్నారు. తమకూ అలాంటి పోలీసు అధికారి ఉంటే బాగుంటుందని ఎన్నో రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. వివిధ రంగాల ప్రముఖులు ఎంతోమంది దిశకు న్యాయం జరిగిందని కామెంట్ చేశారు. సజ్జనార్ ను అభినందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స‌జ్జనార్ ఎక్కడ ప‌నిచేసినా డైన‌మిక్ ఆఫీస‌ర్‌గా గుర్తింపు పొందారు. మొద‌ట ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ ఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు స‌జ్జనార్‌. ఆయనకు ఈ తరహా ప్రశంసలు రావడం ఇది రెండోసారి.

వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సమయంలోనూ ప్రజలు సజ్జనార్ పై ప్రశంసలు కురిపించారు. 2008 డిసెంబర్ 10న వరంగల్ లో స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు యువతులపై ఆసిడ్ దాడి జరిగింది. ఈ సంఘటనలో స్వప్నిక మృతి చెందింది. ప్రణీత చాలా కాలానికి కోలుకుంది. యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అప్పట్లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విషయంలో పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. మూడు రోజుల తరువాత నిందితులను పోలీసులు అరెస్టు చేసి చూపించారు. రాత్రి 7 గంటల సమయంలో నిందితులను మీడియా సమావేశంలో చూపించారు. కేసు విచారణ పూర్తి కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులు వాడిన బైక్, యాసిడ్ సీసాల కోసం గాలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అదే రోజు రాత్రి నిందితులు ఉపయోగించిన వాటిని స్వాధీనం చేసుకునేందుకు వారిని వరంగల్ నగర శివార్లలోని విమానాశ్రయం వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు నిందితులు హతమయ్యారు. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. తాజాగా ఇదే స్టోరీ హైదరాబాద్ లో రిపీట్ అయింది. ఈ రెండు ఎన్ కౌంటర్లలోనూ సజ్జనార్ కీలకపాత్ర వహించారు.

దిశ అత్యాచార నిందితులు ఎన్ కౌంటర్ లో హతమవడంతో కర్నాటకలోని హుబ్లీలో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. అక్కడ సజ్జనార్ నివాసానికి ప్రజలు తరలివచ్చారు. కుటుంబసభ్యులకు అభినందనలు తెలిపారు. కర్నాటక లోని గదగ్ జిల్లాలో సజ్జనార్ జన్మించిన అసుతి గ్రామంలో కూడా ప్రజలు పండుగ చేసుకున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కు ఇలాంటి ప్రజాదరణ దక్కడం ఓ విశేషం. ముంబై లాంటి నగరాల్లో మాఫియా ముఠాలను హతం చేయడానికి ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు ఎన్నో ఎన్ కౌంటర్లు చేశారు. వారెవరికీ దక్కని ఖ్యాతి సజ్జనార్ కు దక్కింది. సమాజంలో రేపిస్టులపై తలెత్తిన వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయికి చేరుకుందో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. న్యాయవ్యవస్థ పై నమ్మకం సడలిన వారెంతో మంది తాజా ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నారు. తక్షణ న్యాయం జరగాలంటే ఇంతకు మించిన మార్గం లేదని అంటున్నారు.

Web TitleReal Hero : Encounter Specialist Cyberabad CP VC Sajjanar Journey
Next Story