Nagarjuna Sagar Bypoll: బీజేపీ అభ్యర్థి ఖరారు..!

Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది.

Arun Chilukuri
Updated on: 25 Sept 2021 5:21 PM IST
Ravi Kumar is TRS Nagarjuna Sagar Bypoll Candidate
X

Nagarjuna Sagar Bypoll: బీజేపీ అభ్యర్థి ఖరారు..!

Nagarjuna Sagar Bypoll: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నాగార్జునసాగర్ లో బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ ను ఎంపిక చేసింది. రవికుమార్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో బీజేపీ అభ్యర్థి కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎస్ టీ అభ్యర్థిని నిలపాలనే బీజేపీ ఆలోచించింది. చివరకు రవికుమార్ నాయక్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఎస్ టీల ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. వారి ఓట్లమీద నమ్మకంతోనే రవికుమార్ ను ఎంపిక చేసింది కాషాయ పార్టీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story