Ration Card E-KYC: రేషన్ కార్డ్ ఈ-కేవైసీ.. ఇదిగో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం..!

Ration Card E Kyc Update Step by Step Process In Telangana Check key Questions and Answers
x

Ration Card E-KYC: రేషన్ కార్డ్ ఈ-కేవైసీ.. ఇదిగో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం..!

Highlights

Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డులు ఏరివేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రేషన్ ఈకేవైసీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డులు ఏరివేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రేషన్ ఈకేవైసీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, చివరి తేదీ లోపు అప్ డేట్ చేయించుకోకపోతే కార్డ్ రద్దువుతుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వ్యాపించాయి. ఈ క్రమంలో మంత్రి గంగుల కమాలకర్ మాట్లాడుతూ.. రేషన్ కార్డ్ ఈకేవైసీకి చివరితేదీ అంటూ ఏదీ లేదని వెల్లడించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తెల్లరేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం..

రేషన్ కార్డ్ eKycని ఎలా అప్‌డేట్ చేయాలి?

రేషన్ కార్డ్ ఇ KYCని అప్‌డేట్ చేయడానికి, ముందుగా మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లాలి.

రేషన్ కార్డులో పొందుపరిచిన సభ్యులందరూ రేషన్ షాప్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

సభ్యులందరూ తమ ఆధార్ కార్డును తమ వెంట తీసుకెళ్లాలి.

ఇప్పుడు ఆధార్ కార్డును రేషన్ దుకాణం నిర్వాహకులకు అందించాలి.

విక్రేత e-POS మెషీన్‌లో సభ్యులందరి ఆధార్ నంబర్‌లను ఒక్కొక్కటిగా నమోదు చేస్తాడు.

ఆ తర్వాత, వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా e-KYC పూర్తవుతుంది.

KYCని పూర్తి చేయడానికి సభ్యులందరూ వేలిముద్ర స్కానింగ్ చేయించుకోవాలి.

ఈ విధంగా మీరు రేషన్ కార్డులో KYCని చాలా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డులో e-KYC అప్‌డేట్ చేయకపోతే ఏమి జరుగుతుంది?

రేషన్ కార్డ్ ఇ Kyc అప్‌డేట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద జరుగుతోంది. దీని కారణంగా మీ రేషన్ కార్డులో KYCని అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీ రేషన్ కార్డులో KYC ప్రక్రియ పూర్తి కానట్లయితే, మీరు రేషన్ దుకాణం నుంచి రేషన్ పొందడంలో సమస్యను ఎదుర్కోవచ్చు. అందువల్ల, సభ్యులందరికీ KYC అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

రేషన్ కార్డ్‌లో ఈ-కేవైసీని అప్‌డేట్ చేయని సభ్యుడి పేరును రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు.

ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే ఈకేవైసీ చేసుకోవాలా?

తెలంగాణలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ వద్ద ఈకేవైసీ చేయించుకోవచ్చు.

ఈకేవైసీకి ఎంత సమయం పడుతుంది?

ఈకేవైసీ చేయించుకోవడానికి నిముషం కంటే తక్కువ సమయమే పడుతుంది.

ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?

రేషన్ ఈకేవైసీ చేయించుకోవడానికి రేషన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అందించాల్సి ఉంటుంది.

చివర తేదీ ఎప్పుడు?

రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకునేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు. ఎప్పుడైనా చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

కుటుంబ సభ్యులంతా ఒక్కచోటే ఈకేవైసీ చేయించుకోవాలా?

రేషన్ కార్డ్‌లోని కుటుంబ సభ్యులంతా ఒక్కచోటే ఈకేవైసీ చేయించుకోవాలని లేదు. ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే, అక్కడికి దగ్గరలోని రేషన్ షాప్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories