కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు ఆనందభాస్కర్

*మోడీ నాయకత్వంలో చేనేత రంగానికి ఒక పాలసీ కూడా లేదు- కేటీఆర్

Rama Rao
Published on: 26 Oct 2022 7:53 PM IST
Rapolu Ananda Bhaskar Joined TRS | TS News
X

కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు ఆనందభాస్కర్

Rapolu Ananda Bhaskar: మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ గులాంబీ కండువా కప్పి రాపోలును పార్టీలోకి ఆహ్వానించారు. రాపోలు వెంట పలువురు పద్మశాలీ సంఘం నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రాపోలు ఆనందభాస్కర్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story