Rani Rudrama: లిక్కర్‌ కేసులో కవిత పాత్రను సైడ్‌ ట్రాక్‌ పట్టించేందుకు డ్రామా.. తెలంగాణలో కామన్‌గా వాడే పదాన్నే బండి సంజయ్‌ వాడారు

Rani Rudrama: బండి సంజయ్‌ వ్యాఖ్యల్లో తప్పు లేదు

Dhatripriya
Published on: 11 March 2023 7:00 PM IST
Rani Rudrama Comments On MLC Kavitha
X

Rani Rudrama: లిక్కర్‌ కేసులో కవిత పాత్రను సైడ్‌ ట్రాక్‌ పట్టించేందుకు డ్రామా

Rani Rudrama: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. తెలంగాణలో చాలా కామన్‌ వాడే పదాన్ని బండి సంజయ్‌ మాటవరుసలో వాడారన్నారు. బండి సంజయ్‌ మాట్లాడిన మాటలు తెలంగాణ నానుడి.. దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. లిక్కర్‌ కేసులో కవిత పాత్రను సైడ్‌ ట్రాక్‌ పట్టించేందుకు డ్రామా చేస్తున్నారని తెలిపారు. మహిళా కమిషన్‌ రాష్ట్రంలో పనిచేస్తుందా అన్న ఆమె ఆ పార్టీ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఒక సర్పంచ్‌ ముందుకు వచ్చినా ఎలాంటి చలనం లేదన్నారు రాణి రుద్రమ. బండి సంజయ్‌కు నోటీసులు ఇస్తే లీగల్‌ ఓపీనియన్‌ తీసుకుని ముందుకు వెళ్తామన్నారు రాణి రుద్రమ.

Dhatripriya

Dhatripriya

Next Story