Hyderabad: ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడికి రిమాండ్

*బస్వరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు *రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

Shilpa
Published on: 11 Nov 2021 1:45 PM IST
Rangareddy Court Remanded Accused Baswaraju for 14 days in Hyderabad LB Nagar Love Issue
X

 ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడికి రిమాండ్(ఫైల్ ఫోటో)

Hyderabad: ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బస్వరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హజరుపర్చారు. బస్వరాజుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. ఇదిలా ఉండగా నిన్న ప్రేమోన్మాది బస్వరాజు దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

యువతి శరీరంపై మొత్తం 18 నుంచి 20 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. కడుపు, లంగ్స్‌ భాగంలో కత్తిపోట్లుతో పాటు పిడిగుద్దులు కూడా గుద్దడంతో అమ్మాయి కడుపులో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయిందన్నారు.

ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గితే అమ్మాయి పరిస్థితి మెరుగు పడుతుందని స్పష్టం చేశారు. ‎సాయంత్రం మరోసారి స్కానింగ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయాలా? వద్దా? అని నిర్ణయిస్తామన్నారు. మరో 24 గంటలు దాటితేనే గానీ యువతి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రాదని అన్నారు డాక్టర్‌ రవితేజ.

Shilpa

Shilpa

Next Story