Rave Party: రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ

Rave Party: రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ
x

Rave Party: రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ 

Highlights

Rave Party: రంగారెడ్డి జిల్లాలో ఫాం హౌసల్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా మద్యం, మహిళలతో పార్టీ జరుపుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

Rave Party: రంగారెడ్డి జిల్లాలో ఫాం హౌసల్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా మద్యం, మహిళలతో పార్టీ జరుపుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. మంచాల మండలం లింగంపల్లి ఫాం హౌజ్ లో రేవ్ పార్టీలో పాల్గొన్న 33 మంది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి రెండు లక్షల 40 వేల నగదు, 11 కార్లు, 15 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నా్రు.

నాంపల్లి నియోజక వర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మూల మధు గౌడ్, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులుకలిసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతర రాష్ర్టాల నుంచి తీసుకు వచ్చిన మహిళలతో నృత్యాలు చేయిస్తూ వీరంతా మద్యం తాగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన ఫాంహౌస్ లో స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. నృత్యాల కోసం ఎనిమిది మంది మహిళల్ని పిలిపించాడు. రేవ్ పార్టీ లో సప్తగిరి స్నేహితులైన ఆనందకుమార్ గౌడ్, మధుగౌడ్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన 24 మందిని సప్తగిరి ఆహ్వానించాడు. అర్ధరాత్రి వేళ భారీ శబ్దాలతో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రియల్టర్ రుద్రశెట్టి సప్తగిరితో పాటు నాంపల్లి బీఆర్ ఎస్ నేత, ఆనంద్ కుమార్ మాజీ కార్పొరేటర్ మూల మధు గౌడ్, అనీల సురేష్ కుమార్, పోరండ్ల మధుకర్, రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, రాంపురం రాజేష్ గౌడ్, కుండేటి విజయ్ శేఖర్ నాయుడు, ఇమ్మిడిశెట్టి హరికృష్ణ, వల్లము రవీంద్ర సాయి కుమార్, పురం సాయి కృష్ణ, పాపేర్తి రాజ్ కుమార్, కొమ్మన సతీష్ కృష్ణ, నుగురు ప్రశాంత్, గట్టేవార్ సునీల్, బండారు రమేష్ మరికొందరు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories