Ramoji Rao: కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర

Ramoji Rao: ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Jun 2024 10:32 AM IST
Ramoji Rao Funeral In Smruthi Vanam In Ramoji Film City
X

Ramoji Rao: రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంత్యక్రియలు

Ramoji Rao: కాసేపట్లో రామోజీరావు అంత్యక్రియలు.. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనున్నాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని విశాలమైన ప్రాంతంలో రామోజీరావు నిర్మాణం చేయించుకున్న స్మృతివనంలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటికే స్మృతివనంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. దీంతో.. రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. ఇవాళ, రేపు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story