రామాయంపేటలో ఉద్రిక్తత.. గంగం సంతోష్, పద్మావతి మృతదేహాలతో నిరసన...

Ramayampet: తల్లికొడుకు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలకు డిమాండ్...

Shireesha
Published on: 16 April 2022 4:08 PM IST
Ramayampet Gangam Santosh Padmavati Self Destruction Protest | Live News
X

రామాయంపేటలో ఉద్రిక్తత.. గంగం సంతోష్, పద్మావతి మృతదేహాలతో నిరసన...

Ramayampet: రామాయంపేటలో బంద్ కొనసాగుతోంది. తల్లి కొడుకులు పద్మ, గంగం సంతోష్ ల ఆత్మహత్య ఘటనపై రామాయంపేట బంద్‌కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయి. తల్లి కొడుకుల ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

రామాయంపేట బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద బంధువులు , అభిమానులు ఆందోళనకు దిగారు. గంగం సంతోష్, పద్మావతి మృతదేహాలతో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ ఇంటి ముందు బైఠాయించారు.

Shireesha

Shireesha

Next Story