Rama Devi: నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పి. రమాదేవి బీజేపీకి రాజీనామా

Rama Devi: 20 ఏళ్లు పార్టీ కోసమే పనిచేశా

Shekhar G
Published on: 27 Oct 2023 6:12 PM IST
Rama Devi Resign To TS Bjp
X

Rama Devi: నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పి. రమాదేవి బీజేపీకి రాజీనామా

Rama Devi: ఎన్నికల వేళ నిర్మల్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న పి. రమాదేవి పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ముధోల్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె.. తీవ్ర మనస్తాపంతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీలోని కొందరు పొమ్మనలేక పొగబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసమే పనిచేసినా.. తనను పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. అనుచరుల నిర్ణయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story