పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ ఖరారు?

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ముఖ్యనేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ దాదాపు ఖాయమన్నట్టుగా వార్తలు వస్తున్నాయ్.

Arun Chilukuri
Updated on: 6 May 2022 7:16 PM IST
Rajyasabha Seat For Ponguleti Srinivas Reddy
X

పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ ఖరారు?

Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ముఖ్యనేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ దాదాపు ఖాయమన్నట్టుగా వార్తలు వస్తున్నాయ్. తుమ్మల, పొంగులేటి మధ్య సమన్వయం సాధించి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే క్రమంలో రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ నేరుగా డీల్ చేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న పొంగులేటికి ముఖ్య పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలో పార్టీకి ఊపు వస్తోందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇప్పటికే తుమ్మల వ్యవహారాన్ని సెట్ చేసిన నేతలు తాజాగా పొంగులేటిని పెద్దల సభకు పంపించిజిల్లా రాజకీయాలపై పట్టు సాధించగలుగుతామని విశ్వాసంతో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story