గులాబీ అధిష్టానంపై డీఎస్‌ ఎందుకంత గుస్సా అయ్యారు.. వ్యూహాత్మకంగానే మాటల తూటా పేల్చారా?

గులాబీ అధిష్టానంపై డీఎస్‌ ఎందుకంత గుస్సా అయ్యారు.. వ్యూహాత్మకంగానే మాటల తూటా పేల్చారా?
x
డీఎస్‌
Highlights

టీఆర్ఎస్ తో ఆ రాజ్యసభ సభ్యుడు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారా..?

టీఆర్ఎస్ తో ఆ రాజ్యసభ సభ్యుడు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారా..? మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆయన, ఒక్కసారిగా గులాబీ పార్టీని టార్గెట్ చేయడం వెనుక కారణం అదేనా...? కాంగ్రెస్‌ను వీడి చారిత్రాత్మక తప్పిదం చేశానని ఆ సీనియర్ నేత ప్రకటన వెనుక హస్తం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం ఏమైనా ఉందా...? లేకుంటే కమలం గూటికి చేరే వ్యూహాంలో భాగమా..? రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ రాజ్యసభ సభ్యుని హాట్ కామెంట్స్‌‌పై, స్టేట్‌ పాలిటిక్స్‌లో హాట్‌హాట్‌గా డిస్కషన్‌ సాగుతోంది.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన టీఆర్ఎస్ అధిష్ఠానాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో కాక రేపుతోంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు డి.ఎస్. పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తూ, సీఎం కేసీఆర్‌కు గతంలో లేఖ రాశారు. తప్పు చేస్తే చర్య తీసుకోవాలని చెప్పిన డి.ఎస్., అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు డి.ఎస్. కు ఆహ్వానం అందకపోవడంతో ఆయన అంతే దూరంగా ఉంటూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాకుండా బీజేపీ తరపున పోటీ చేసిన తన తనయుడు, అర్వింద్ గెలుపు కోసం ఇంటర్నల్ గా పనిచేశారనే ఉద్దేశ్యంతో పార్టీ పూర్తిగా డి.ఎస్. ను పక్కన పెట్టింది.

ఇదే సందర్భంలో డి.ఎస్. పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి డి.ఎస్. సైతం గట్టిగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇలా నిత్యం డి.ఎస్. ఎపిసోడ్ ఇటు టీఆర్ఎస్‌లోనే కాకుండా, అటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతూ వస్తోంది. ఐతే తాజాగా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి డి.ఎస్. ను టార్గెట్ చేస్తూ విమర్శ చేయడంపై, డి.ఎస్. డైరెక్ట్ గా పార్టీ పై ఎదురు దాడి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మొన్నటి వరకు డి. శ్రీనివాస్ అసంతృప్తిగా ఉంటూ వచ్చినా పార్టీ అధిష్ఠానంపై, కేసీఆర్‌పై డైరెక్టుగా విమర్శలు చేసిన సందర్భాల్లేవు. తొలిసారిగా ఆయన కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూస్తే, పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. కేసీఆర్‌కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాలు విసరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో డి.ఎస్. కాంగ్రెస్‌ను వీడి చారిత్రాత్మక తప్పిదం చేశానని కామెంట్ చేయడాన్ని బట్టి చూస్తే డి.ఎస్. కు ఇంకా హస్తం పార్టీపై ప్రేమ తగ్గలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీని వీడితే సోనియా గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో హస్తం గూటికి చేరుతారా లేకుంటే కుమారుడు ఎంపీగా ఉన్న పార్టీలో చేరుతారా అన్న చర్చ సాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు డి.ఎస్. టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడాన్ని, బట్టి చూస్తే ఇంటర్నల్ గా గులాబీ పార్టీ విజయావకాశాలకు గండి కొట్టే ప్రయత్నంలో భాగమే అన్న ప్రచారం నడుస్తోంది. ఇటు టీఆర్ఎస్ నేతలు సైతం ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. డి.ఎస్. పై మంత్రి చేసిన విమర్శలు ఆయనకు కోపం తెప్పించినప్పటికీ బలమైన సామాజిక వర్గం ఓటర్లు టీఆర్ఎస్‌కు దూరం చేసేందుకు ఆయన, ఆ రేంజ్‌లో ఫైర్ అయ్యారనే ప్రచారం కూడా ఉంది. అధికార పార్టీ రాజ్యసభ పదవిలో ఉన్న డి.ఎస్., పార్టీ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై గులాబీ బాస్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories