బీజేపీలో చేరకముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరుత్సాహం..?

Komatireddy Raj Gopal Reddy: పాదయాత్ర రూట్‌ మార్చాలని బండి సంజయ్‌ను కోరిన రాజగోపాల్‌రెడ్డి

Jyothi
Published on: 10 Aug 2022 10:17 AM IST
Rajgopal Reddy Appealed to do a Padayatra in Munugodu Constituency
X

బీజేపీలో చేరకముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరుత్సాహం..?

Komatireddy Raj Gopal Reddy: బీజేపీలో చేరకముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. పాదయాత్ర రూట్‌ మార్చాలని నిన్న బండి సంజయ్‌ను కోరారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే.. రూట్‌ మార్పుపై రాజగోపాల్‌రెడ్డికి బండి సంజయ్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 21న చౌటుప్పల్‌లో జరిగే బీజేపీ సభ ద్వారా రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీలో చేరాల్సి ఉంది. అయితే.. చౌటుప్పల్‌ సభకు అమిత్‌ షా హాజరుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 26న వరంగల్‌ సభకు అమిత్‌షా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారంలోనే రెండు సభలకు అమిత్‌ షా వస్తారా..? అనే సందేహంలో కమలనాథులు ఉన్నారు. మరోవైపు.. అమిత్‌ షా సమక్షంలోనే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు రాజగోపాల్‌రెడ్డి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాజగోపాల్‌పై కాంగ్రెస్‌ నేతలు మాటల దాడి పెంచారు.

Jyothi

Jyothi

Next Story