ఒంటె పాలు @600

ఒంటె పాలు @600
x
Highlights

ప్రతి రోజు చాలామంది ఆవు పాలు, గేదె పాలు, మేక పాలతో వ్యాపారం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఒంటె పాలతో వ్యాపారం చేయడం ఎక్కడ చూడలేదు. సాధారణంగా ప్రతి రోజూ...

ప్రతి రోజు చాలామంది ఆవు పాలు, గేదె పాలు, మేక పాలతో వ్యాపారం చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఒంటె పాలతో వ్యాపారం చేయడం ఎక్కడ చూడలేదు. సాధారణంగా ప్రతి రోజూ మనం కొనే గేదె పాలు రూ.60 కో, రూ.70కో అమ్ముతారు. కాని తక్కువగా అమ్మే ఒంటె పాలకు మాత్రం డిమాండ్ చాలానే ఉంటుంది.

ఈ నేపథ్యం కొందరు ఒంటెల వ్యాపారులు ఒంటె పాల వ్యాపారం చేయడానికి ఏకంగా రాజస్థాన్‌ నుంచి కొంత మంది పాలు అమ్మి ఉపాధి పొందడానికి నగరానికి వలస వచ్చారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఒంటె పాలను లీటర్‌ రూ.600కు విక్రయిస్తున్నారు. అలా అమ్మడం ద్వారా ఎంతో కొంత ఆదాయాం వస్తోందని, దాని ద్వారా ఉపాధి పొందుతున్నామని వారు పేర్కొన్నారు.

ఒంటె పాలలో ఔషధ గుణాలు...

సాధారణ పాలతో పోలిస్తే ఒంటె పాలలో ఔషధ గుణాలు ఎక్కువగానే వున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పాలల్లో ఒమేగా-3ఫాటీ ఆసిడ్స్‌, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు సంతృప్తకొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. విటమిన్‌ సి, బీ2, ఏ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి.

వాటితో పాటు మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌ వంటి ఖనిజలవణాలు ఇందులో కావల్సిన స్థాయిలో ఉంటాయి. అంతే కాక ఈ పాలు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఆహారంలో ఎక్కువగా ఇస్తారట. టీబీ, జాండిస్‌, రక్తహీనత, ఆటిజం, మధుమేహం వంటి వ్యాధుల బాధితులకు దీన్ని తమ ఆహారం లో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories