T Rajaiah: ఇంటి దొంగలే శిఖండిలా మారి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

T Rajaiah: తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు.

Arun Chilukuri
Published on: 10 March 2023 3:59 PM IST
Rajaiah Alleges Disgruntlement Against him Within the Party
X

T Rajaiah: ఇంటి దొంగలే శిఖండిలా మారి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

T Rajaiah: తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. జరిగిన విషయాలన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

తాజాగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని జానకీపురం సర్పంచ్ నవ్య మీడియా ముందుకొచ్చారు. తనను బీఆర్ఎస్‌ నాయకుడు పెడుతున్న లైంగిక, మానసిక వేధింపులపై ఘాటు ఆరోణలు చేశారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని ..తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది సర్పంచ్ నవ్య.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story