Raja Singh: నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా ధర్మం కోసం పోరాడుతా

Raja Singh: జనవరి 29న ముంబైలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు

Jyothi
Published on: 31 Jan 2023 1:05 PM IST
Raja Singh Sensational Comments
X

Raja Singh: నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా ధర్మం కోసం పోరాడుతా

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు పంపినా ధర్మం కోసం పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 29 న ముంబైలో జరిగిన కార్యక్రమంలో తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్టుగా మంగళ్ హట్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు. నిన్న తనకు మంగళ్‌హట్ పోలీసులు నోటీసులిచ్చినట్టుగా రాజాసింగ్ చెప్పారు.

తెలంగాణలో ఎనిమిదో నిజాం పాలన సాగుతోందని రాజాసింగ్ విమర్శించారు. లవ్ జిహాద్, గో హత్య, అవినీతిపై తాను మాట్లాడినట్టుగా రాజాసింగ్ వివరించారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని తాను మహరాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్టుగా రాజాసింగ్ చెప్పారు. మహరాష్ట్రలో తాను మాట్లాడితే మంగళ్‌హట్ పోలీసులు తనకు లేఖలు అందిస్తున్నారని మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story