Komatireddy Laxmi: నాంపల్లి మండలం పశువునూరులో ఎన్నికల ప్రచారం

Komatireddy Laxmi: జనానికి నిత్యం అందుబాటులో ఉన్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి

Jyothi
Published on: 28 Oct 2022 6:30 AM IST
Raj Gopal Reddy Wife Lakshmi Election Campaign
X

Komatireddy Laxmi: నాంపల్లి మండలం పశువునూరులో ఎన్నికల ప్రచారం

Komatireddy Laxmi: ఎన్నికల సమయంలో తప్ప, మరెప్పుడూ అందుబాటులో ఉండని ప్రభుత్వ ప్రతినిధులు మునుగోడుపై ఎన్నడూలేని ప్రేమను ఒలకబోస్తున్నారని రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ ధ్వజమెత్తారు. నాంపల్లి మండలం పశువునూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడంటే తెలియని వాళ్లంతా ఒక్కసారిగా వాలిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధిపనులు చేపట్టడం తెలియని ప్రతినిధులు, ఏయే గ్రామంలో ఎవరెవరిని ఎలా కొనాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో దేశమంతా మునుగోడువైపు చూస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జనానికి నిత్యం అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని లక్ష్మీకోరారు.

Jyothi

Jyothi

Next Story