Weather Report: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

Weather Report: తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు

Shashank Gullapelli
Published on: 19 May 2024 7:06 PM IST
Rains For Three More Days In Telangana
X

Weather Report: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

Weather Report: సాధారణంగా మే నెలలో ఎండలు దంచికొడతాయి. కానీ కానీ ప్రజంట్ మే నెలలో వర్షాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చేసింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలానే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జనగామ, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, వరంగల్, నారాయణపేట, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story