TS Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Rainfall likely to lash Telangana for three More Days
x

TS Rains: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Highlights

TS Rains: తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం

TS Rains: ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల3 రోజుల పాటు తెలంగాణలో, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా కోస్తాకు తుఫాన్‌ గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18-20 తేదీల మధ్య అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడనున్న అల్పపీడనం అనంతరం వాయుగుండంగా... తుఫాన్‌గా బలపడి ఈ నెల 22 తర్వాత కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వాయుగుండం థాయ్‌లాండ్‌ మీదుగా ఈనెల 18 కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించి ఉపరితల ఆవర్తనంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories