Weather Report: తెలంగాణలో నేడు వర్ష సూచన

Weather Report: 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2024 10:42 AM IST
Rain forecast in Telangana today
X

Weather Report: తెలంగాణలో నేడు వర్ష సూచన

Weather Report: తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానపడే ఛాన్స్ ఉందని.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు వర్షసూచన చేసింది.కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story