Telangana: రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన

Telangana: తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది

Arun Chilukuri
Published on: 7 Dec 2021 3:21 PM IST
The Hyderabad Meteorological Department Said that it Will Rain in Telangana Tomorrow
X

రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన (ఫోటో-ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. ఇక, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story