Telangana: తెలంగాణకు వర్ష సూచన

రానున్న నాలుగైదు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

Venkata Chari
Updated on: 10 May 2021 11:30 PM IST
Rain Forecast for Telangana in Coming Days
X

తెలంగాణలో వర్షాలు (ఫొటో ట్విట్టర్)

Telangana: రానున్న నాలుగైదు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా కేరళ తీరం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పలు చోట్ల పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Venkata Chari

Venkata Chari

Next Story