TS Weather Report Today: ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు

Rain Alert in Telangana Today 10 01 2022 and Tomorrow 11 01 2022 | Weather Report Today
x

TS Weather Report Today: ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు

Highlights

TS Weather Report Today: ఆదివారం పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు ...

TS Weather Report Today: ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో ఇవాళ, రేపు రాష‌్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి.

అత్యధికంగా బరంపూర్‌2.2, దస్తురాబాద్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు పెరగడంతో చలి తీవ్రత కొంత తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా తాళ్లపల్లిలో 15.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories