Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన

Weather Report: ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

Rama Rao
Updated on: 11 Sept 2022 6:45 PM IST
Rain Alert in Telangana | TS News Today
X

Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన 

Weather Report: తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడడమే కాకుండా ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని..రానున్న 24 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story