రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు

*తెలంగాణ అమరవీరుల కుటుుంబాలతో రాహుల్ లంచ్ మీటింగ్

Rama Rao
Published on: 1 May 2022 3:37 PM IST
Rahul Gandhis Telangana schedule has been finalized
X

రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు

Rahul Gandhi: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణ షెడ్యూల్ ఖరారయ్యింది. మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ శంషాబాద్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్‌లో వరంగల్‌ చేరుకుంటారు. రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో ప్రసంగిస్తారు. సభ పూర్తయ్యాక రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకొని రాత్రికి కోహినూర్ హోటల్‌లో రాహుల్ బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం కాంగ్రెస్ కీలక నేతలతో అల్పాహార విందులో పాల్గొంటారు. సంజీవయ్య పార్క్ కు వెళ్లి నివాళి అర్పించాక గాంధీ భవన్ కు చేరుకుంటారు. పార్టీ నేతలు 200 మందితో రాహుల్ సమావేశమవుతారు. డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలెర్స్ తో ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్‌కు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Rama Rao

Rama Rao

Next Story