Rahul Gandhi: రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi Telangana Tour: వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 6 May 2022 8:36 PM IST
Rahul Gandhi Warning To Telangana Congress Leaders
X

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi Telangana Tour: వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్, బీజేపీలతో లాలూచీపడే నేతలు తమకు వద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికే టికెట్‌ ఇస్తామన్నారు. కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలు విమర్శించేవారిని ఎంత పెద్దవారైనా సహించమని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ స్నేహితులేనని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, తెలంగాణలో టీఆర్ఎస్‌ను బీజేపీ రిమోట్‌తో నడిపిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story