Rahul Gandhi: తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత పర్యటనతో హస్తం శ్రేణుల్లో నయా జోష్

Shekhar G
Published on: 20 Oct 2023 6:30 PM IST
Rahul Gandhi Visit To Telangana Ends
X

Rahul Gandhi: తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. తొలి విడత బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. ములుగులో ప్రారంభమైన యాత్ర.. భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి మీదుగా ఆర్మూర్ నియోజకవర్గం వరకు 3రోజుల పాటు కొనసాగింది. బస్సు యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పాదయాత్రలో రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో రాహుల్ సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సు యాత్రలో..ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రాహుల్. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. అలాగే కేసీఆర్ పాలనా వైఫల్యాలు, అవినీతిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ఆరోపణలు చేశారు. రాహుల్ పర్యటన సందర్భంగా ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత పర్యటనతో హస్తం శ్రేణుల్లో నయా జోష్ నింపినట్టైంది.

Shekhar G

Shekhar G

Next Story