Revanth Reddy: రేవంత్ కీలక వ్యాఖ్యలు..మనం కూర్చున్న కొమ్మని..

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 4 Aug 2021 4:17 PM IST
Rahul Gandhi to Visit Telangana in September Says Revanth Reddy
X

రేవంత్ కీలక వ్యాఖ్యలు..మనం కూర్చున్న కొమ్మని..

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్నవారిని కేసీఆర్ కోవర్టులుగా మార్చుకుని రాజకీయ లబ్ది పొందుతున్నందున అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని రేవంత్ అన్నట్లుగా తెలుస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని, అందరూ కష్టపడి పార్టీకోసం పనిచేద్దామనీ రేవంత్ అన్నట్లు సమాచారం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కఠిన చర్యలు తప్పవని రేవంత్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాక సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న దళిత దండోరా కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారని, రోజంతా కార్యకర్తలతో గడుపుతారనీ తెలుస్తోంది. అయితే దళిత దండోరా ఎక్కడ నిర్వహించేది ప్రాంతం, తేదీ మొదలైన వివరాలను త్వరలోనే పార్టీ నిర్ణయిస్తుందని రేవంత్ అన్నట్లుగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story